NTR: వివిధ పంటలకు బీమా పరిహారం పొందేందుకు అందుబాటులో ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ భూమి కలిగిన యజమానులు, సీసీఆర్సీ కార్డులు పొందిన సాగుదారులు పథకాల్లో చేరేందుకు అర్హులని అన్నారు.