GNTR: మంగళగిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఏఈ సురేశ్ తెలిపారు. ఉదయం 8:30 నుంచి 11:30గంటల వరకు పట్టణంలోని గండాలయ్యపేట, కొత్తపేట, ఆర్ అండ్ బీ బంగ్లా రోడ్, హాస్పిటల్ రోడ్, మెయిన్ బజార్, ఎయిమ్స్ గేట్, ఎకో పార్క్, ఎల్.బి నగర్, ఆంజనేయ కాలనీ, క్యాంప్ ఏరియా, విప్పటం రోడ్డు, భగత్ సింగ్ నగర్లలో పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు.