ASR: కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అల్లూరి జిల్లా ఛైర్మన్గా పాంగి గంగాధర్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ పార్టీ అధిష్టానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అరకు మండలం లోతేరు గ్రామానికి చెందిన గంగాధర్ ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయన సేవలు గుర్తించిన అధిష్టానం ఆ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఛైర్మన్గా నియమించింది.