KRNL: ఆదోని పట్టణంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని కృష్ణ గుడి దగ్గర తండ్రి, కుమారుడు బైక్ పై వెళుతున్న క్రమంలో బైకును లారీ ఢీకొంది. ఈ ఘటనలో బాలుడు (10) అక్కడికక్కడే మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడు కళ్ళెదుటే మృతి చెందడంపై కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.