SKLM: పాతపట్నం మండల కేంద్రానికి సమీపంలోని కాకితోట వద్ద శనివారం గుణుపూర్ నుంచి పూరి వెళ్తున్న రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహం నుజ్జునుజ్జయింది.