TPT: అలిపిరి పాదాల మండపంలోని శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరారు. టీటీడీ అధికారులు బాలాలయం జరిగే వద్ద నడకదారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.