GNTR: గుంటూరులో జపాన్‌కు చెందిన డాక్టర్ మావోటో హబారా, వైద్యులు హరిత, శివప్రసాద్ బృందం కలిసి మూడు సంక్లిష్ట కార్డియాక్ కేసులను విజయవంతంగా నిర్వహించారు. బైపాస్ సర్జరీ చేసిన మహిళకు ప్రధాన ధమనిలో బ్లాకేజ్ ఉండగా, మరో రోగిలో తీవ్ర కాల్షియం నిక్షేపాలు గుర్తించారు. ఒక రోగికి CABG సర్జరీ సాధ్యపడకపోయినా రోటాబ్లేషన్, స్టెంటింగ్ ద్వారా చికిత్స అందించారు.