VZM: పాచిపెంట పీహెచ్సీని జిల్లా డిప్యూటీ డీఏం&హెచ్వో కె.పద్మావతి శనివారం అకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె ఓపీ రికార్డులు తనిఖీ చేపట్టారు. అలాగే ల్యాబ్ పరిశీలించారు. మందులు ఉన్నది లేనిది సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం వచ్చిన ప్రజలకు మెరుగైన వైద్య అందించాలని వైద్యాధికారి డాక్టర్ రవిచంద్రకు సూచించారు.