BPP: బాపట్ల పట్టణంలోని టీచర్స్ కాలనీలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రేమ, కరుణ, సహనమే క్రైస్తవ మత సారాంశమని ఆయన పేర్కొంటూ, యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడతాయని అన్నారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.