PLD: సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు.. ఊరూరా డూడూ బసవన్నల నృత్యాలు కనువిందు చేస్తున్నాయి. సన్నాయి మేళాలు, గంగిరెద్దుల విన్యాసాలతో అమరావతి పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఏటా 6నెలల పాటు వలస వెళ్లే గంగిరెద్దుల వారు, ఈ పండుగ వేళ ఇంటింటికీ తిరిగి మన సంప్రదాయాలను గుర్తు చేస్తున్నారు. గ్రామస్థులు ఇచ్చే పిడికెడు గింజలు, కానుకలతో వారు జీవనం సాగిస్తూన్నారు.