NDL: నంది కొట్కూరు పట్టణ BRR నగర్లో ప్రభుత్వం కోటి రూపాయల వ్యయంతో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్నికి నేడు MLA జయసూర్య హాజరై, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే కూటమి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.