సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కేక్ కట్ చేసి పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు మరింత మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందించాలని సిబ్బందిని కోరారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఎస్సై శివశంకర్‌ను ఎస్పీ ఘనంగా సత్కరించారు.