VZM: గజపతినగరం మండలంలోని సీతారాంపురంలో బుధవారం ఎంపీడీవో కళ్యాణి గ్రామ సచివాలయం, పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సచివాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.