GNTR: ఎస్పీ సతీశ్ కుమార్ శుక్రవారం ఉదయం తెనాలి వచ్చారు. పోలీస్ పరేడ్లో పాల్గొన్న అనంతరం ఎస్పీ ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అందరూ కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. క్రమశిక్షణతో మెలగాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని అన్నారు. తెనాలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అనేక చర్యలు చేపడుతున్నామన్నారు.