SKLM: ఎచ్చర్ల మండల కేంద్రంలో పట్టపగలు వీధి దీపాలు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇలా వీధి దీపాలు వెలగడంతో పంచాయతీ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట వీధి దీపాలు వెలగడం వలన పంచాయితీకి విద్యుత్ బిల్లు అధికమవుతుందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు