GNTR: ఈ నెల 11న తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగనున్న ‘మా-ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి 203 లఘు చిత్రాలు పోటీకి వచ్చినట్లు దర్శకుడు దిలీప్ రాజా ఆదివారం తెలిపారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న పోటీలలో విజేతలకు సినీ ప్రముఖుల జ్ఞాపకార్థం నగదు బహుమతులు అందజేయనున్నారు.