ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కందకూరు లో నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకుంది. దాదాపు 8మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆయన సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో… తోపులాట జరిగింది. ఈ క్రమంలో… కార్యకర్తలు కొందరు పక్కనే ఉన్న డ్రైనేజ్ లో పడిపోయారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ… అప్పటికే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
వెంటనే చంద్రబాబు నాయుడు తన ప్రసంగం ఆపేసి.. ఆసుపత్రి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కందుకూరులో ఇలాంటి దుర్ఘటన జరగడం తన మనసు కలచివేసిందన్నారు. అమాయకులు చనిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు.
తన బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల్లో చదివిస్తామన్నారు.