»Chandrababu Threat To My Safety With Prisoners Letter To Judge
Chandrababu: జైల్లో నాకు ప్రాణ హానీ ఉంది..జడ్జికి లేఖ
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు కొన్ని రోజులు నుంచి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటున్నారు. అయితే తన భద్రతతోపాటు ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు.
AP Cid Challenges Chandrababu Regular Bail In Supreme Court
Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భద్రతపై కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు మొదటి నుంచి సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు చంద్రబాబు కూడా తన భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. ‘తాను జైలుకు వచ్చినప్పుడు కొందరు వీడియోలు, ఫొటోలు తీశారు. తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చింది. కానీ పోలీసులు ఆ లేఖపై ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. ప్రస్తుతం జైలులో చాలా సంఘటనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.
కొందరు దుర్మార్గులు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారు. ఎన్డీపీఎస్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి పెన్ కెమెరాతో జైల్లో ఉంటూ..తోటి ఖైదీల ఫొటోలు తీసున్నాడు. రాజమండ్రి జైలుపై ఓ డ్రోన్ కెమెరాతో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. కానీ జైలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. జైలులో మొత్తం 2200 మంది ఉండగా..అందులో 750 మందిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ నా భద్రతకు ముప్పుగా మారాయి. ఈ నెల నా కుటుంబంతో కలిసి వెళ్తున్న సమయంలో కూడా మరో డ్రోన్ కెమెరా షూట్ చేసింది. దీనిని బట్టి చూస్తుంటే నాతో పాటు కుటుంబానికి కూడా ముప్పు ఉందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.