ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కు నిరసన సెగ తగిలింది. ఓ శుభకార్యంలో ఒక బీఆర్ఎస్ నేత ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆయన ఖమ్మం(Khammam)కు వచ్చిన ఆయన ఓ హోటల్లో బస చేశారు. అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు మంత్రి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.అంబటి రాంబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.’ఖమ్మం గడ్డ టీడీపీ అడ్డా.. ఇక్కడికి నువ్వెందుకొచ్చావ్’ అంటూ రాంబాబును టీడీపీ నేతలు(TDP leaders)నిలదీశారు. టీడీపీ కార్యకర్తల ఆందోళనతో షాక్‌కు గురైన అంబటి రాంబాబు.. కారెక్కి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కారును అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.. ముందుకు పోనీయకుండా జై చంద్రబాబు (Chandrababu) అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్‌కు జామ్ ఏర్పడింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా వారు నినదించారు. ఆయన వెళ్తున్న కాన్వాయ్‌కు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని అంబటి రాంబాబును అక్కడి నుంచి సురక్షితంగా పంపించేశారు.