టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement Scam Case)లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఈ తరుణంలో ఆయన్ని న్యాయవాదులు కలిసేందుకు మూడు ములాఖత్‌లు ఇవ్వాలని ఆయన లాయర్లు కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు ఆయనకు రోజుకు 2 ములాఖత్‌లు ఇచ్చేందుకు ఒప్పుకుంది.
న్యాయవాదులు చంద్రబాబును కలిసేందుకు రోజులు 2 లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రేపటి నుంచి చంద్రబాబుకు రెండు ములాఖత్‌లు ఇవ్వనున్నారు. ఇకపోతే ఆయన రిమాండ్‌ను నవంబర్ 7వ తేది వరకూ పొడిగిస్తూ కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ పూర్తవ్వడంతో ఆయన జైలు నుంచే వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు న్యాయాధికారితో మాట్లాడారు. తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని చంద్రబాబుబు ఏసీబీ కోర్టుకు తెలిపారు.
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ-జనసేన (TDP-Janasena) జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ తేది 23 సోమవారం రోజు జరగనుంది. రెండు పార్టీలకు తొలి జాయింట్ యాక్షన్ కమిటీ కావడం విశేషం. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ పార్టీలు సమావేశమై రాజకీయ పరిణామాల గురించి చర్చించనున్నాయి. ఈ సమావేశానికి నారా లోకేశ్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరై పలు సూచనలు చేయనున్నారు.