సత్యసాయి: సోమందేపల్లి మండలం చాకర్లపల్లి రైల్వేగేట్ బుధవారం మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాక్ రైల్వే గేట్ మూసేస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు, వాహనదారులు గమనించి తమకు సహకరించాలని కోరారు.