PPM: పాలకొండ నియోజకవర్గం నాలుగు మండలాల్లో వివిధ గ్రామాల్లో మొక్కజొన్న ధర నేల చూపు చూస్తోంది. పది రోజుల వరకూ క్వింటాల్ రూ. 2,400 వరకూ ఉండగా ప్రస్తుతం రూ. 2 వేలు పలుకుతోంది. మరింతగా ధర తగ్గుతుందని వ్యాపారులు అంటుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ .2,225 ప్రస్తుతం ఉంది.