CTR: జిల్లా వ్యాప్తంగా మొదటి రోజైన సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 89.62 శాతం జరిగినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,31,885 మందికి గాను తొలి రోజున 2,07,823 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారు. మిగిలిన 24,062 మంది లబ్ధిదారులకు మంగళవారం ఇవ్వనున్నట్లు పీడీ తెలిపారు.