CBI interrogate Sudhakar:వివేకా హత్య కేసులో పీబీసీ సుధాకర్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం
CBI interrogate Sudhakar:మాజీమంత్రి వైఎస్ వివేకానంద (ys viveka) హత్య కేసు విచారణను సీబీఐ స్పీడప్ చేసింది. ఇటీవల ఎంక్వైరీని స్పీడప్ చేసింది. ఎవరి సందేహాం కలిగిన.. నోటీసులు ఇచ్చి మరీ విచారిస్తోంది. ఈ రోజు పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను (sudhakar) విచారించారు. కడపలో వివిధ అంశాలపై 2 గంటల పాటు (2 hours) విచారించారు.
CBI interrogate Sudhakar:మాజీమంత్రి వైఎస్ వివేకానంద (ys viveka) హత్య కేసు విచారణను సీబీఐ స్పీడప్ చేసింది. ఇటీవల ఎంక్వైరీని స్పీడప్ చేసింది. ఎవరి సందేహాం కలిగిన.. నోటీసులు ఇచ్చి మరీ విచారిస్తోంది. ఈ రోజు పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను (sudhakar) విచారించారు. కడపలో వివిధ అంశాలపై 2 గంటల పాటు (2 hours) విచారించారు. ఎంపీ అవినాష్‌రెడ్డితో (avinash reddy) ఫోటో దిగిన విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు (Kadapa Central Jail)లోని అతిథిగృహానికి విచారణకు రావాలని పేర్కొంది. సీబీఐ అధికారుల బృందం బుధవారం పులివెందులలోని భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy)ఇంటికి వెళ్లి నోటీసులు అందజేసింది. వివేకా హత్య జరిగిన రోజు సంఘటన స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడం, హత్య వెనుక కుట్రను ఛేదించేందుకు ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
గత నెల 24న హైదరాబాద్‌లో ఆయన కుమారుడు అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారించింది. అవినాశ్‌రెడ్డిని సీబీఐ బృందం హైదరాబాద్‌లో రెండు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. వివేకా (viveka murder case) హత్య కేసులో ఇప్పటికే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి (krishna mohan reddy), జగన్ భార్య భారతి (bharathi) పీఏ నవీన్ (naveen), అవినాష్‌ను (avinash) విచారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా భాస్కర్ రెడ్డిని (bhaskar reddy) సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి (vivekananda reddy) చనిపోయారు. అతని మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో సిట్ (sit) దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత వివేకా (viveka) కూతురు కోరడంతో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో రోజుకో పేరు రావడం.. వారిని విచారణకు పిలువడం జరుగుతూనే ఉంది. భారతీ పీఏ నవీన్ (naveen) పేరు తెరపైకి వచ్చింది. ఆయన జగన్ (jagan), భారతీకి (bharathi) దగ్గరి వ్యక్తి.. గత 15 ఏళ్లుగా వారితో ఉంటున్నారని తెలిసింది.