NTR: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ చివరి రోజున కలెక్టర్ లక్ష్మీశా దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. శ్రీ మల్లేశ్వర మహా మంటపం మార్గంగా కాలినడకన వెళ్లి హోమగుండం, అన్నప్రసాదం, ఇరుముడి సమర్పణ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకోగా, భక్తులు ఆలయంలోని ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.