GNTR: పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో నేటి నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు తెలిపారు. పట్టణంలోని 17 సచివాలయాల పరిధిలో కేటాయించిన పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ ఆధార్ ప్రత్యేక క్యాంపులు కొనసాగుతాయన్నారు. విద్యార్థులు తమ ఆధార్ కార్డులో మార్పులు చేర్పులను సరి చేసుకోవాలన్నారు.