NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బర్దిపూర్ సర్పంచ్ కోట్ల భాస్కర్, ఉపసర్పంచ్ తోట మహేష్ సోమవారం సాయంత్రం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. బర్దిపూర్ గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.