KRNL: దేవనకొండలోని నెల్లిబండలో ఎంపీఈవో రఫీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఈవో మాట్లాడుతూ.. రైతులు తప్పనిసరిగా ఆధార్, పాస్బుక్ తీసుకువచ్చి మాత్రమే యూరియా పొందాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా పంపిణీ చేపడుతున్నామన్నారు. మాజీ సర్పంచ్ మల్లికార్జున, రైతులు పాల్గొన్నారు.