KKD: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తుఫాన్ తీరం దాటే వరకు కాకినాడ రూరల్ సముద్ర తీర ప్రాంత రోడ్డు, బీచ్‌ను మూసివేస్తున్నట్లు రూరల్ తహశీల్దార్ కుమారి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సముద్ర స్నానానికి వెళ్లే భక్తులు అటువైపు రావద్దని, ప్రజల భద్రత దృష్ట్యా బలమైన గాలుల అవకాశం ఉన్నందున సహకరించాలన్నారు.