NTR: విజయవాడ వరలక్ష్మి నగర్లో రేషన్ స్మార్ట్ కార్డులను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోమవారం పంపిణీ చేశారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ స్మార్ట్ కార్డుల ద్వారా పారదర్శకంగా సరుకులు అందజేయవచ్చని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు దిశానిర్దేశాల ప్రకారం.. ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా ఈ చర్యలు కొనసాగుతున్నాయన్నారు.