ATP: వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మి నరసింహస్వామిని జిల్లా స్పెషల్ కోర్ట్ జడ్జ్ కే.శివశంకర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసి శ్రీవారిని దర్శించుకున్నారు.