NLR: నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలను శుక్రవారం నిర్వహించారు. ఈ సంబరాల్లో ముఖ్య అతిధిలుగా నగర మేయర్ స్రవంతి జయవర్ధన్, కమిషనర్ సూర్య తేజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అన్ని రకాల సంప్రదాయక ఏర్పాట్లతో నెల్లూరు నగర పాలక సంస్థ ప్రాంగణంలో సంక్రాంతి వైభవం ఉట్టిపడుతోందని తెలిపారు.