TPT: సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల నుంచి అధిక చార్జీ వసూలు చేసినా, ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గూడూరు రవాణాశాఖ అధికారి హెచ్చరించారు. వాహనాలకు సరి అయిన రికార్డులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నా జప్తు చేస్తామని స్పష్టం చేశారు.