BPT: భట్టిప్రోలులో వీధుల్లో పందుల సంచారం తీవ్రమైంది. ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో అవి విచ్చలవిడిగా తిరుగుతుండటంతో రోగాల భయం వెంటాడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఇప్పటికైన స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని సోమవారం స్థానిక ప్రజలు కోరుతున్నారు.