W.G: భీమవరం పట్టణంలోని గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామిని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.