ATP: గుంతకల్లులోని అన్న క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ శుక్రవారం తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్‌కి వచ్చిన ప్రజల గురించి అల్పాహారం నాణ్యత గురించి ఆరా తీశారు. క్యాంటీన్ పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అన్న క్యాంటీన్‌కి వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలన్నారు.