AKP: బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మత్స్యకారులు అర్థ నగ్నంగా నిరసనలు తెలియజేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.