SKLM: ఎల్.ఎన్.పేట మండలం పాడలి గ్రామానికి చెందిన గవర శ్రీనివాసరావు గత కొద్ది సంవత్సరాలుగా పెరాల్సిస్తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇవాళ వారిని పరామర్శించారు. అనంతరం ఆయనకు రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇలాంటి కష్టకాలంలో తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.