కర్నూలు: జిల్లాలోని ఓర్వకల్లుకు చెందిన 15 ఏళ్ల బాలుడు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ఐదుగురికి ప్రాణదానం లభించడంపై CM చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని ఆదివారం అభినందించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడటం గొప్ప విషయమని సీఎం కొనియాడారు.