ELR: జిల్లాలో స్థానిక ఆశ్రమం ఆసుపత్రి వద్ద ఆదివారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాల ధ్రువపత్రాలు సరిచూసి, పత్రాలు లేని వాహనాలకు చలానాలు విధించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కుటుంబ సభ్యులపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో 1 టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.