మార్కాపురంలో మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవంలో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం తెలిపారు. టిడిపి నాయకుల కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 8వ తేదీ ఉదయం 10:30 నుండి 12:30 వరకు మహిళా దినోత్సవ వేడుకలు, 12:30 నుండి 1:30 వరకు టిడిపి నాయకుల సమావేశం, 2 నుండి 4:30 వరకు వెలుగొండ సందర్శన ఉంటుందన్నారు.