ELR: జంగారెడ్డిగూడెంలో గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ శుక్రవారం క్లాస్రూమ్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో ప్లేట్ మర్చిపోయానని చెప్పి గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.