దేశం అంతా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోంది. పేదవాడి అభివృద్ధికి నోచుకోని శత్రువులంతా ఒక్కటై పోతున్నారు. జగన్ గాలితో గెలిచిన వాళ్ళు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుతో కలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Narayana Swamy : సీఎం జగన్పై ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోయే వారిని దేవుడు క్షమించడని, జగన్ వైపే ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారని, నారా లోకేష్ పాదయాత్ర మాత్రం ఒక కులం వెంట పరిగెడుతోందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తిరుమలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశం అంతా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తోంది. పేదవాడి అభివృద్ధికి నోచుకోని శత్రువులంతా ఒక్కటై పోతున్నారు. జగన్ గాలితో గెలిచిన వాళ్ళు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుతో కలిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెన్నుపోటు దారులు అంతా ఒక్కటైనా జగన్ ను ఏం చేయలేరని డిప్యూటీ సీఎం అన్నారు. బెంగుళూరు నుండి బస్సులో కేవలం తమ సామాజిక వర్గం వాళ్ళను తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం లోకేష్ చేస్తున్నారని, నారా లోకేష్ పాదయాత్రలో జగనన్న శాంక్షన్ చేసిన రోడ్డు శిలాఫలకాన్ని కొట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
జగన్ శాంక్షన్ చేసిన రోడ్డుపైనే నారా లోకేష్ నడుచుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని, వనదుర్గాపురం, డిఎన్.కండ్రిగలో ఫారెస్ట్ క్లియరన్స్ ఇచ్చి రోడ్డు వేయించారన్నారు. రూ.194 కోట్లతో అగ్రిమెంట్ అయి రేపో ఎల్లుండో రోడ్లు వేస్తున్నామని, ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు వేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దళిత వర్గాలను అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ కు పూల మాల వేసేందుకు లోకేష్ ఇష్ట పడలేదని, నారా లోకేష్ తో తిరిగే దళితులందరికి నవరత్నాల సంక్షేమ పథకాలు అందాయని, ఆ విషయం నారా లోకేష్ తెలుసుకోవాలన్నారు.
దళిత రిజర్వ్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ పార్టి ఇంచార్జ్ ను పెట్ట లేదని, బలిసి పోయిన అచ్చం నాయుడుకి బుద్ది, జ్ఞానం రాలేదని, దళిత నియోజకవర్గంలో పార్టి ఇంఛార్జ్ ను పెట్టలేని దౌర్భాగ్యం టీడీపీ వాళ్లదన్నారు. దళితులకు రాజకీయ బిక్షం పెట్టిన వ్యక్తి సీఎం జగన్ అని చెప్పిన ఆయన, నారా చంద్రబాబు దళితులకు ఏం చేసారని ప్రశ్నించారు. ఓటు కోసం పేదవాడి నెత్తురు తాగేవాడు చంద్రబాబు అని, ఒక్క రూపాయి ఇళ్లు ఇస్తామని చెప్పి పేదలను చంద్రబాబు మోసగించాడని, టీడీపీ ఎప్పుడూ కోటీశ్వరులకు కొమ్ము కాసే పార్టీ అని నారాయణ స్వామి మండిపడ్డారు.