కృష్ణా: సంక్రాంతి సెలవులు ముగియడంతో ఆదివారం విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్నవారితో ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల తదితర మండలాల గుండా వెళ్లే నేషనల్ హైవేపై వాహనాల బారులు తీరాయి. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9 నుంచి సాధారణం కంటే ఎక్కువగా రోజుకు 50 వేలకు పైగా వాహనాలు వెళుతున్నాయని NHAI చెబుతున్నారు.