ప్రకాశం: జలజీవన్ మిషన్ ద్వారా అద్దంకి నియోజకవర్గంలోని గ్రామాలలో రక్షిత తాగునీటి సరఫరా, ఆర్వో ప్లాంట్ల నిర్మాణం, ఇంటింటికీ కొళాయిల ఏర్పా టు తదితర పనులకు రూ.57.47కోట్లు మంజూరైనట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జలజీవన్ మిషన్ జీవం కూడా తీసేశారన్నారు. కూటమి ప్రభుత్వం జలజీవన్ మిషన్ లక్ష్యాలు చేరుకుంటుందన్నారు.