NDL: నందికొట్కూరు మండలం కొల్లభావాపురంలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ ఆదివారం తెలిపారు. 30 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. నాటుసారా క్రయవిక్రయాలు చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. రామేశ్వరి అనే మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.