KDP: మైదుకూరు నియోజకవర్గంలో బాలికల గురుకుల పాఠశాల ఉందని, పాఠశాల నుంచి కళాశాల స్థాయికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని శనివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అసెంబ్లీలో కోరారు. కళాశాలగా మారడం వల్ల చాలామంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ విషయమై పరిశీలన చేయాలని సూచించారు.