NTR: నందిగామ పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు కోరారు. పట్టణంలో ప్రతి వీధి, ప్రతి ఇంటికి తిరుగుతూ వ్యాపారస్తులకు, ప్రజలకు పన్నులు వెంటనే చెల్లించాలని తెలిపారు. స్థలం పన్నులు, వ్యాపార లైసెన్సులు, ప్రకటన ఛార్జీలు చెల్లించాలన్నారు.