SKLM: గార మండలం వాడాడ గ్రామ సర్పంచి చెక్ పవర్‌ను ఆరు నెలలపాటు రద్దు చేస్తూ ఎంపీడీవో ఎస్. శ్రీనివాసులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక చెరువు వేలం నుంచి వచ్చిన రూ.1.30 లక్షలు పంచాయతీ ఖాతాలో జమ కాలేదని గ్రామస్థుల ఫిర్యాదుల నేపధ్యంలో జరిగిన విచారణలో సర్పంచి నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో చెక్ పవర్ రద్దు చేసినట్లు తెలిపారు.