కర్నూలు: సామాన్య భక్తుల సౌకర్యార్థం రద్దీ రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం, అర్జిత అభిషేకాలు నిలుపుదల చేసినట్లు శ్రీశైలం ఈవో ఆజాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించే భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోందని అన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు.